Studio18 News - TELANGANA / NIZAMABAD : వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కలను పరిశీలించిన ఎంపీడీవో లక్ష్మారెడ్డి. ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ రోజు ధర్పల్లి మండల కేంద్రంలో గల వీధి కుక్కలకు వెటర్నరీ డాక్టర్ చేత కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అనంతరం నర్సరీ మొక్కలను ఎంపీడీవో లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వీధి కుక్కల భారి నుండి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపారు. వేసవికాలం సమీపిస్తున్న సందర్భంగా మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలని, మొక్కలకు కావాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మేళ్ళ శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్, కారాబార్ సామేందర్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News