Studio18 News - TELANGANA / KHAMMAM : మధిర బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారంతో ముగిసింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది చింతల గోపాల్ వెల్లడించారు. చివరి రోజు అధ్యక్ష పదవికి బోజెడ్ల పుల్లారావు, పల్లపోతు కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ పదవి కోసం చావలి రామరాజు, కావూరు రమేష్ నామినేషన్ దాఖలు చేయగా, తాజాగా మరో ఇద్దరు నామినేషన్ వేయడంతో మొత్తం అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి భైరవ భట్ల వెంకటరమణ, సూరం శెట్టి సునీత నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవికి గంధం శ్రీనివాసరావు, కోట జ్ఞానేష్, పల్లపోతు కృష్ణారావు నామినేషన్ దాఖలు చేయగా, కోశాధికారి పదవికి తూములూరి సంధ్య నామినేషన్ దాఖలు చేశారు. జాయింట్ సెక్రటరీ-1 పదవికి భైరవభట్ల వెంకటరమణ, కోటా రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. కోశాధికారి పదవికి తూములూరి సంధ్య, మహిళా ప్రతినిధి పదవికి మాధురి తేజ, జాయింట్ సెక్రటరీ-2 పదవికి సూరం శెట్టి సునీత ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో వారి నామినేషన్లు సక్రమంగా ఉంటే వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారి తెలిపారు.
Admin
Studio18 News