Monday, 16 March 2026 01:54:07 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Date : 07 March 2026 08:26 PM Views : 46

Studio18 News - TELANGANA / NIZAMABAD : మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే సమాజం అభివృద్ధి దిశగా సాగుతుందని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు “హ్యాపీ ఉమెన్స్ డే” అనే ఆంగ్ల అక్షరాల రూపంలో కూర్చొని మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. కుటుంబ విలువలను కాపాడుతూ సమాజ పురోగతికి మహిళలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. మహిళల విద్య, సాధికారత, హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమాజం మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవభావం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తే దేశ అభివృద్ధికి మరింత దోహదం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :