Studio18 News - TELANGANA / NIZAMABAD : Dharmapuri మండలంలోని పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో భాగంగా పందెనవాడ-1 ముదిరాజ్ కుల బాంధవులు మూడవరోజు బోనాలు తీసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయం 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మూడవరోజు ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున ఇంటింటికి ఒక బోనం తీసుకొని Gandhi Statue Dharmapuri వద్దకు చేరుకొని అనంతరం డప్పు వాయిద్యాలతో పెద్దమ్మ దేవాలయం వరకు వెళ్లి అక్కడ పెద్దమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. ఈరోజుతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Admin
Studio18 News