Tuesday, 10 March 2026 03:36:50 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు

Date : 09 March 2026 09:08 PM Views : 10

Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : పాండిచ్చేరిలోని తిరునల్లార్‌లో గల ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో శని పేర్చి పవిత్ర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుంభ రాశి నుండి మీన రాశికి శని గ్రహం మారిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుండి 45 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 6, 7, 8 తేదీలలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి శని భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శని పేర్చి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. ఆలయ 27వ పీఠాధిపతి మహా సన్నిధానం శ్రీ లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ వారి ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్, సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ నందనపాటి రాము ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఐదవ సారి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయంలో హోమాలు, శని భగవానుడి అభిషేకాలు నిర్వహించగా నందనపాటి రాము కుటుంబ సభ్యులు, సోలిస్ హాస్పిటల్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శివ శ్రీ టి. రాజస్వామి నాథ శివాచార్యులు, మాలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హరివర్ధన్ రెడ్డి, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కరైకల్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీ సౌజన్య, కరైకల్ కలెక్టర్ ఇషితా రాఠి, ఈఓ సుబ్రమణ్యం, కాప్రా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, శంకర్ బాబు, విజయేందర్ రెడ్డి, గజేందర్, మోహన్, అరికపూడి ప్రసాద్, డాక్టర్ కె. వెంకటేశ్వర ప్రసాద్, డాక్టర్ కోటేశ్వరరావు, యుఎస్ఏ బాలాజీ, వెంకట రాజు, మేధా సురేష్, మాజీ ఏపీ లేబర్ కమిషన్ శ్రీనివాసరావు తదితరులతో పాటు సోలిస్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :