Sunday, 29 March 2026 05:19:30 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు

Date : 07 February 2026 07:08 PM Views : 116

Studio18 News - TELANGANA / HYDERABAD : ఈ ఆత్మహత్య కేసులో తమకు ఇప్పటి వరకు అనుమానాలు లేవన్న సోదరుడు చిరంజీవి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తామన్న సోదరుడు చిరంజీవి తన ఇద్దరు పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి కేసులో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె సోదరుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో గత వారం విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయం వెల్లడి కాలేదు. అయితే ఈ ఘటనపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని సోదరుడు చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయా ఛానళ్లపై ఫిర్యాదు చేయడానికి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయారెడ్డి, పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డి మృతిపై తాము డిప్రెషన్‌లో ఉన్నామని ఆయన అన్నారు. తనన చెల్లెలు ఆఫీసు వర్కుతో బిజీగా ఉండేదని, కంపెనీలో టీమ్ లీడర్ కాబట్టి 14 మందిని లీడ్ చేసేదని, దాంతో ఆమెపై డిప్రెషన్ ప్రభావం ఉండేదని అన్నారు. ముగ్గురి మరణంపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. మాపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేయడానికి వస్తే కోర్టుకు వెళ్లమని పోలీసులు చెప్పారని, హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. విజయా రెడ్డి డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలను పోలీసులు ఖండించారు. ఈ ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని, విచారణ జరుపుతున్నామని అన్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :