Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్పల్లి ఎన్ఎస్ఎస్ రెడ్ రిబ్బన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీల్లో కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వ్యాసరచన మరియు పోస్టర్ మేకింగ్ విభాగాల్లో జిల్లా స్థాయిలో మొదటి, రెండో బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ జ్యోతి విద్యార్థులను అభినందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అపర్ణ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం కుమారస్వామి, డాక్టర్ సిహెచ్ రామచందర్ పాల్గొన్నారు.
Admin
Studio18 News