Studio18 News - TELANGANA / RANGAREDDY : చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ కాలనీలోని మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయొద్దని కాలనీవాసులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, కాలనీవాసుల వినతిమేరకు ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్, పార్క్ స్థలం కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ స్థలం ఇవ్వలేమని తెలియజేసిన నేపథ్యంలో ప్రభాత్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్లు నరసింహగుప్త, విట్టల్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రభాత్ నగర్ కాలనీ అధ్యక్షులు బాల్ రెడ్డి, గట్టు శ్రీను, రమణారెడ్డి, రామారావు, రాజేష్, నాగేందర్, బాలరాజు, విద్యాసాగర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News