Studio18 News - TELANGANA / KARIMNAGAR : మండుటెండలో కార్యకర్తల హోరులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. రామడుగు మండలంలో జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో కేంద్ర మంత్రి అడుగుల వేగాన్ని తగ్గించారు. రామడుగు మండలం కోన్ రావుపేట సమీపంలో పెద్ద ఎత్తున నడుస్తున్న కార్యకర్తల జోష్ దృశ్యాలను చిత్రీకరించేందుకు కార్యకర్తలు డ్రోన్ ఎగరేశారు. అయితే ఆ డ్రోన్ అక్కడే చెట్టుపైనున్న తేనెతుట్టెను తాకడంతో తేనెటీగలు బయటకు వచ్చి కాసేపు గందరగోళం నెలకొంది. తేనెటీగలు కొందరు కార్యకర్తలపై దాడి చేయడంతో అప్రమత్తమైన బండి సంజయ్ పరిస్థితిని గమనించారు. గాయపడ్డ కార్యకర్తలకు డాక్టర్లు చికిత్స అందించారు. అనంతరం కొద్ది దూరం వెళ్లి చెట్టు కింద బండి సంజయ్ సేదదీరగా వైద్యులు కేంద్ర మంత్రికి రొటీన్ చెకప్ నిర్వహించారు. కొద్ది నిమిషాల అనంతరం బండి సంజయ్ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికే సుమారు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసిన ఆయన కాసేపట్లో గంగాధర మండల కేంద్రానికి చేరుకోనున్నారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పాదయాత్ర కొనసాగించనున్న కేంద్ర మంత్రి సాయంత్రం 6.30 గంటల వరకు కొండగట్టుకు చేరుకోవాలనే దీక్షతో మండుటెండలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
Admin
Studio18 News