Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ శివారు అల్వాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోటర్‌బైక్‌పై వేగంగా వెళుతున్న వ్యక్తిని ఓ వృద్ధుడు నెమ్మదిగా వెళ్లమని చెప్పాడు. అంతే.. బైక్‌పై ఉన్న వ్యక్తి ఆ వృద్ధుడిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. దాంతో వృద్ధుడి తలకు బలమైన గాయాలు కావడంతో గురువారం చనిపోయాడు. సెప్టెంబరు 30న ఈ సంఘటన జరిగింది. బాధితుడు 65 ఏళ్ల ఆంజనేయులు. ఈ ఘటన తాలూకు సీసీటీవీ ఫుటేజీని తాజాగా పోలీసులు విడుదల చేశారు. వీడియోలో ఆంజనేయులుపై సదరు వ్యక్తి భౌతికంగా దాడి చేయడం ఉంది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆంజనేయులును కాపాడేందుకు కుటుంబ సభ్యులు ఎంతగానో ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ వృద్ధుడు చనిపోయాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Admin
Studio18 News