Studio18 News - తెలంగాణ / : దానం నాగేందర్ అసెంబ్లీలో దుర్భాషలాడారని, ఆయన హెచ్చరికలకు ఎవరూ భయపడరని, మళ్లీ పాత రోజులు వస్తాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు. ఇవాళ కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దానం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని దమ్ముంటే రావాలని సవాలు విసిరారు. దానం నాగేందర్‌కి కేసీఆర్ ఎమ్మెల్యే పదవిని భిక్షగా పెట్టారని తెలిపారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని కౌశిక్ రెడ్డి అన్నారు. కాగా, అసెంబ్లీలోనూ దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. బయట తిరగనివ్వబోమని దానం నాగేందర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని సీఎం రేవంత్ సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. మరో నాలుగు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ సర్కారు ఇవ్వాలని, జాబ్ క్యాలండర్ అంటూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసిందని అన్నారు.
Admin
Studio18 News