Studio18 News - TELANGANA / : జూరాల డ్యామ్‌లో కొన్నిచోట్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఈ డ్యామ్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల డ్యాం భద్రతపై సండేహాలు తలెత్తుతున్నాయి. జూరాల డ్యాం గేట్లలో పలుచోట్ల లీకేజీలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్యాం గేట్లకు మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. దీంతో 2021లో ప్రభుత్వం మరమ్మతుల కోసం కొన్ని నిధులను విడుదల చేసింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మొత్తం 62 గేట్లలో ఐదింటికి మాత్రమే మరమ్మతులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
Admin
Studio18 News