Studio18 News - తెలంగాణ / : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఎవరైనా అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఇలాంటి చోట ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
Admin
Studio18 News