Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జాతీయ రహదారి 44పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం సమీపంలోని జాతీయ రహదారి 44పై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలా వైపు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రి రెండు గంటల సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Studio18 News