Studio18 News - తెలంగాణ / : Delhi Liquor Policy CBI Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకుంది. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. రేపటికి కేసును వాయిదావేస్తూ, ఆరోజు తుది విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో కవిత న్యాయవాదులు ఈరోజే కేసును ఉపసంహరించుకున్నారు. సీబీఐ చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని, కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జూలై 6న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, చార్జ్ షీట్లో తప్పులేమీ సీబీఐ పేర్కొంది. ఇప్పటికే సీబీఐ చార్జ్ షీట్ ను జూలై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగస్టు 9న చార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
Admin
Studio18 News