Saturday, 14 March 2026 08:11:32 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు

Date : 13 March 2026 04:14 PM Views : 6

Studio18 News - TELANGANA / NIZAMABAD : జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం గర్భగుడిలో రంగనాయక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సమేతంగా అన్నప్రసాదం స్వీకరించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. పలువురు గ్రామస్తులు ఆలయ నిర్మాణం విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి విన్నవించగా తప్పకుండా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణంతో పాటు గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకే పార్టీలు అని, గెలిచిన తర్వాత అభివృద్ధే పరమావధి అని పేర్కొన్నారు. రాజకీయ భేషజాలకు పోకుండా గ్రామస్తులు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారం చూపిస్తానని సూచించారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు చిన్నా రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముసుకు సాయి రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కౌలాస్ మోహన్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, పార్టీ యువ నాయకులు ఉమ్మాజి నరేష్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :