Studio18 News - తెలంగాణ / : దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరికాదని... ఆమె వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్ అండ్ డీ, డెస్క్ జాబ్‌లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనల వల్ల చాలామందికి రుణమాఫీ కావడం లేదని విమర్శించారు. కోతలు పెట్టేందుకు రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదలీ చేశారని మండిపడ్డారు. ప్రస్తుత విభాగాలలోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలని సూచించారు.
Admin
Studio18 News