Thursday, 12 March 2026 04:18:18 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Danam Nagender: బీఆర్ఎస్ వాళ్లు చెప్పలేని పదాలతో సభలో దూషించారు.. అవి రికార్డ్ కాలేదు: దానం నాగేందర్

Date : 03 August 2024 12:44 PM Views : 392

Studio18 News - TELANGANA / : నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పరుషపదజాలం ఉపయోగించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ అంశంపై మరోసారి స్పందించారు. శాసన సభలో హైదరాబాద్ అభివృద్ధిపై తాను మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదేపదే ఆటంకం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు బయటకు చెప్పలేని పదాలతో తనను దూషించారని ఆరోపించారు. వారు మాట్లాడింది మైక్‌లో రికార్డ్ కాలేదన్నారు. ముఖ్యమంత్రిని, తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... శాసన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కావాలని టార్గెట్ చేశారన్నారు. తాను బీఆర్ఎస్ సభ్యుల పట్ల చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో వాడుక భాషలోనివే అన్నారు. ఆ మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే మాత్రం క్షమాపణ చెబుతున్నానన్నారు. అధికారం కోల్పోవడం వల్ల బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గత పదేళ్ల కాలంలో ఏరోజూ తనలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. వారు తమ తీరును మార్చుకోవాలన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :