Studio18 News - తెలంగాణ / : Janwada Farmhouse Survey : జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వే కొనసాగుతోంది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారు. డిప్యూటీ ఇన్ స్పెక్టర్, ఆర్ఐ, మండల సర్వేయర్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. ఇరిగేషన్, రెవెన్యూ శాఖతో కలిపి ఆరుగురు సభ్యుల బృందంతో మ్యాప్ ఆధారంగా సర్వే చేస్తున్నారు. ముల్కనూర్ నుంచి జన్వాడ ఫామ్ హౌస్ వరకు సర్వే జరుగుతోంది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసినప్పటి నుంచి జన్వాడ ఫామ్ హౌస్ పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ ది అని, ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాలా ప్రవహిస్తోంది. నాలాలో ఫామ్ హౌస్ ప్రహరీ గోడ, గేటు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారుల సంయుక్త సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఏ క్షణంలోనైనా ఫామ్ హౌస్ ను నేలమట్టం చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
Admin
Studio18 News