Studio18 News - TELANGANA / HYDERABAD : Group 1 | గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కొట్టేసింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని గతంలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీతోపాటు పలువురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం తాజాగా తుది తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్‌లో ఇప్పటికే నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది.
Admin
Studio18 News