Studio18 News - తెలంగాణ / : Telangana Budget 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కాగా.. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తద్వారా రాబోయే కాలంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున 10వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు జలమండలికి రూ. 3,385 కోట్లు, సీఎం చైర్మన్ గా వ్యవహరిస్తున్న హైడ్రా కు రూ. 200 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. అదేవిధంగా.. ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ. 100కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు రూ. 200 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు కేగాయించగా.. పాత బస్తీలో మెట్రో మెట్రో విస్తరణఖు రూ. 500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కొరకు రూ. 50 కోట్లు కేటాయించగా.. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కొరకు రూ. 1,500 కోట్లు రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు.
Admin
Studio18 News