Studio18 News - తెలంగాణ / : అంత మంది ముఖ్యమంత్రులను చూశామని.. రేవంత్ రెడ్డిలాంటి సీఎంని చూడలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలకు అవకాశం ఇవ్వాలని గతంలో ముఖ్యమంత్రులు అన్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని అన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని తెలిపారు. 48 గంటల్లో ఐదుగురు మహిళలపై అత్యాచారాలు జరిగాయని సబిత అన్నారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని సభలో 4 గంటలు నిలబడితే కూడా ఇవ్వలేదని తెలిపారు. సభలో మాట్లాడుదామంటే మైక్ ఇవ్వడం లేదని సబిత అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఇటీవల బాగా పెరిగాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాము సభలో 4 గంటలు నిలిచున్నా అవకాశం ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మేము నిలిచి ఉంటే కాంగ్రెస్ నేతల్లో రాక్షసనందం కనిపించిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిందని, రాష్ట్రంలో అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ‘నేను రేవంత్ ను నడి బజారులో నిలబెట్టానా? రాజా భవనంలో ఉంచానా? నన్ను వైఎస్ఆర్ చేవెళ్ల చెల్లెమ్మ అన్నారు… కాంగ్రెస్ పార్టీ పిలువలేదు. మాకు ఈ రోజు క్షమాపణ గురించి మాట్లాడే అవకాశం అడగలేదు. అక్కలు అంటూ మాకు పంగ నామాలు పెడుతున్నారు’ అని సబిత అన్నారు. మహిళా మంత్రులకు బాధ్యత లేదా?: సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అత్యాచార ఘటనలపై మహిళా మంత్రులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళల గురించి మాట్లాడాలని తాము సభలో అవకాశం ఆడిగామని తెలిపారు. తమను అగౌరవపరచడంతోనే తాము పార్టీ మారామని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ పుణ్యమా అని తనపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. శాసనసభ నడుస్తున్న తీరు సక్రమంగా లేదని విమర్శించారు.
Admin
Studio18 News