Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ లో (జీహెచ్ఎంసీ పరిధిలో) నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు ప్రముఖ హోటళ్లకే టోకరా వేశారు. హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తామంటూ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అక్రమ సంపాదన కోసం వీరు ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల అవతారం ఎత్తారు. గిస్మత్ మండీ హోటళ్లలో వారు తనిఖీలు చేశారు. అయితే వీరు మరొక హోటల్‌లో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి వచ్చామని తనిఖీలు చేపట్టారు. దీంతో హోటళ్ల యజమానులకు అనుమానం వచ్చి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాము తనిఖీలు నిర్వహించలేదని చెప్పడంతో హోటళ్ల యజమానులు బిత్తరపోయారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌ల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు నకిలీలు అని తెలిపోయింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు నమోదు అయింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు హోటల్స్ వద్ద మాటు వేసి ఇద్దరు నకిలీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్లను పట్టుకున్నారు. అనంతరం వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ నకిలీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ బాధిత హోటళ్లలో సికింద్రాబాద్ అల్ఫా, స్వాగత్ గ్రాండ్, కెప్టెన్ కుక్, పరివార్, కృతంగా హోటళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News