Thursday, 15 May 2025 02:23:40 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

KTR: బీఆర్ఎస్ బ‌లం కార్య‌క‌ర్త‌లేన‌ని మ‌రోసారి రుజువైంది: కేటీఆర్‌

Date : 13 September 2024 01:54 PM Views : 103

Studio18 News - TELANGANA / : బీఆర్ఎస్ నిజ‌మైన బ‌లం కేడ‌ర్‌లోనే ఉంద‌ని కార్య‌క‌ర్త‌లు మ‌రోసారి నిరూపించారని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్ట్ చేశారు. "నిన్న‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అణ‌చివేత చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ధైర్యంగా నిల‌బ‌డ్డారు. రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్ళు రువ్వినా, దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్నా ధైర్యంగా నిలబడి పోరాడారు. ఇలా ధైర్యంగా నిల‌బ‌డ్డ‌ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతిఒక్క సోదరుడికి, సోదరితో పాటు సోషల్ మీడియాలో అండగా నిలిచిన యోధులకి వందనాలు! బీఆర్ఎస్ నిజమైన బలం మన దృఢమైన కేడర్‌లో ఉందని మన నిర్భయ కార్యకర్తలు మరోసారి నిరూపించారు. మ‌నం అంద‌రం కలిసి తెలంగాణ గర్వాన్ని, ఆత్మను, భవిష్యత్తును కాపాడుకుందాం జై బీఆర్ఎస్, జై తెలంగాణ" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విష‌యం తెలిసిందే. చివరికి అరెస్ట్‌ల వ‌ర‌కు వెళ్లింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :