Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గంగాధర మండలంలోని సుమారు 90 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి అని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో గంగాధర మండలాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో ధమని రాము పాల్గొని లబ్ధిదారుల వివరాలను వివరించారు. మండల వ్యాప్తంగా వచ్చిన 90 చెక్కులను పారదర్శకంగా పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Admin
Studio18 News