Studio18 News - TELANGANA / NAGARKURNOOL : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బిఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఎస్పీ పార్టీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ తెల్కపల్లి మండల కేంద్రములో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామ సభల ద్వారా కాకుండా, తాను టిక్ పెట్టిన వాళ్ళకే వస్తాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మాట్లాడటాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచారని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలుపొందలేదని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన నియోజకవర్గ ప్రజలందరికీ దక్కాలని కోరారు. కూచుకుళ్ళ కుటుంబ ఆస్తులు ప్రజలకు వొద్దు అనీ, ప్రజలు ట్యాక్స్ ల ద్వారా కట్టిన డబ్బులు మాత్రమే ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. రాజేష్ రెడ్డి కి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని దుయ్యబట్టారు. అనంతరం బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి . రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేగా గెలుపొందిన శాసనసభ్యులు, నియోజక వర్గ ప్రజలందరికీ శాసన సభ్యులుగా వ్యవహరించాలని హితవు పలికారు. నియోజకవర్గంలో రాజ్యాంగ బద్దంగా పాలన కొనసాగించాలని కోరారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిపివో గార్లు ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా అనీ ప్రశ్నించారు. ఒకవేళ కట్టుబడి ఉన్నట్లు ఐతే వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించారు. అలా లేని పక్షంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. బేషరతుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ నియోజక వర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
Also Read : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
Admin
Studio18 News