Sunday, 29 March 2026 05:25:17 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Telangana High Court: సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

Date : 30 January 2026 07:33 PM Views : 165

Studio18 News - TELANGANA / SANGAREDDY : సిగాచి ఫార్మా ప్రమాద బాధితుల పరిహారంపై హైకోర్టు అసహనం ప్రభుత్వం తీరుపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం పరిహారం ఎప్పుడు, ఎంత ఇస్తారో చెప్పాలంటూ ప్రశ్నలు కంపెనీతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ డైరెక్టర్లకు నోటీసులు సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరిహారం పంపిణీలో జాప్యం, స్పష్టత లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో 56 మంది దుర్మరణం చెందగా, 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాధితులకు పరిహారం అందించాలని, ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. "పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇస్తున్నారు? అసలు ఎప్పుడు ఇస్తారు?" అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిహారం పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కంపెనీని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసులో ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలిని సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు చట్టప్రకారం అందాల్సిన ప్రయోజనాల వివరాలను సమర్పించాలని వారికి నోటీసులు జారీ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :