Studio18 News - TELANGANA / MANCHERIAL : కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన లింగంపల్లి వర్షిత. బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన లింగంపల్లి వర్షిత మరణానంతరం ఆమె కళ్లను దానం చేయడం ద్వారా మరో ఇద్దరికి వెలుగు నింపారు. వర్షిత తల్లిదండ్రులు లింగంపల్లి శ్రీనివాస్, లావణ్య తమ కుమార్తె కళ్లను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్, 6వ వార్డు కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి వర్షిత ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి బాధలో భాగస్వామ్యం అవుతూ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని అభినందించారు. ఇలాంటి మహోన్నత నిర్ణయాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, మరింత మంది కళ్ల దానం చేయడానికి ముందుకు రావాలని వారు కోరారు. వర్షిత కుటుంబం చూపిన మానవతా విలువలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Admin
Studio18 News