Sunday, 29 March 2026 05:20:59 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Kalvakuntla Kavitha: కేటీఆర్ అలా చెబుతుంటే నవ్వు వచ్చింది: సోదరుడిపై కవిత విమర్శలు

Date : 21 January 2026 07:25 PM Views : 92

Studio18 News - TELANGANA / HYDERABAD : సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయమని కేటీఆర్ డిమాండ్ చేయడంపై విమర్శ పదేళ్లు అధికారంలో ఉండి సికింద్రాబాద్ కోసం ఉద్యమించిన వారిని జైల్లో వేశారని ఆరోపణ ఈరోజు కేటీఆర్ జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తుంటే నవ్వు వస్తోందని వ్యాఖ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సేవ్ సికింద్రాబాద్' ర్యాలీకి కేటీఆర్ మద్దతు తెలిపారు. సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలన్న కేటీఆర్ డిమాండ్‌పై కవిత స్పందిస్తూ, "కేటీఆర్ సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని ఉద్యమిస్తుంటే నాకు నవ్వు వస్తోంది. సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని డిమాండ్ చేసిన వారిని పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అణిచివేశారు, జైళ్లలో వేశారు. కానీ, ఇప్పుడు కేటీఆర్ వెళ్లి సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయమని మాట్లాడుతున్నారు" అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కవిత స్పష్టత రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేసే విషయమై కవిత మాట్లాడుతూ, జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. అయితే, ఎన్నికల్లో మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, మహిళలు కోరితే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :