Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : తన బైకుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి పైన మూర్తి రెడ్డి అనే వ్యక్తి తన బైక్‌కు సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో మద్యం మత్తులో వేములవాడ డిపోకు చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్‌లపై దుర్భాషలాడుతూ దాడికి దిగేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికుల ముందే బూతులు తిడుతూ నానా హంగామా సృష్టించాడు. ఘటన సమయంలో డ్రైవర్ తో పాటు స్థానికులు వీడియోలు రికార్డ్ చేయగా… అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గత 15 రోజుల క్రితం ఇదే జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన మరవకముందే మరోక ఘటన చోటు చేసుకోవడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలను అతిక్రమిస్తూ, ప్రజల ప్రాణాలను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుందని ఆర్టీసీ సిబ్బంది వాపోతున్నారు.. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి, వీడియోలను ఆధారంగా తీసుకొని చర్యలకు సిద్ధమయ్యారు. డ్రైవర్లు, కండక్టర్ల భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కూడా కోరుతున్నారు.
Admin
Studio18 News