Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఇందల్వాయి, సిరికొండ, జక్రాన్‌పల్లి, మోపాల్, డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్, ధర్పల్లి తదితర మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలను విన్నవించారు. వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం పలు సూచనలు చేశారు. తక్షణ పరిష్కారానికి అనువైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Admin
Studio18 News