Wednesday, 10 December 2025 02:20:07 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

నారాయణ స్కూలులో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య

హయత్ నగర్ లో సోమవారం అర్ధరాత్రి ఘటన స్కూలు ముందు విద్యార్థి కుటుంబ సభ్యుల ఆందోళన ఫిజిక్స్ సార్ వేధింపులే కారణమని ఆరోపణ

Date : 17 December 2024 12:53 PM Views : 449

Studio18 News - TELANGANA / : నారాయణ హైస్కూలులో దారుణం జరిగింది. క్లాస్ లీడర్ తో ఫిజిక్స్ టీచర్ కొట్టించాడనే ఆవేదనతో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకోగా.. యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు మరణానికి న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి నారాయణ స్కూలు ముందు ఆందోళనకు దిగారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ రెసిడెన్షియల్ స్కూలులో లోహిత్ ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం క్లాస్ రూంలో ఫిజిక్స్ టీచర్ లోహిత్ ను మందలించాడు. క్లాస్ లీడర్ తో లోహిత్ ను కొట్టించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లోహిత్.. హాస్టల్ రూంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉరి వేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి వార్డెన్ కు చెప్పగా.. లోహిత్ ను కిందకు దించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే, అప్పటికే లోహిత్ చనిపోవడంతో స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. లోహిత్ తల్లిదండ్రులు వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. కొడుకు చనిపోయిన విషయం పోలీసులు చెబితేనే తమకు తెలిసిందని, స్కూలు యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని లోహిత్ తండ్రి మధుసూదన్ రెడ్డి చెప్పారు. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తన కొడుకు చనిపోయాడని, ఆ టీచర్ తో పాటు స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం వద్ద బాంబు కలకలం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :