Sunday, 08 February 2026 11:50:08 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

ఎవరు ఏమనుకున్నా సరే కేంద్రంతో కలిసి పని చేస్తా!: రేవంత్ రెడ్డి

Date : 23 May 2025 04:19 PM Views : 429

Studio18 News - TELANGANA / : సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జహీరాబాద్ నిమ్జ్‌ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లాకు, దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకుంటూ, "మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా" అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. జహీరాబాద్‌ను 'గేట్‌వే ఆఫ్ ఇండస్ట్రీస్'గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, అవసరమైన నిధులను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. పటాన్‌చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిదని, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని సీఎం గుర్తుచేశారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకాన్ని అమలు చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలతో పోటీ పడేలా మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. స్థానికంగా చక్కెర పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు సహకార సంఘంగా ఏర్పడితే, నిమ్జ్‌లో వంద ఎకరాల భూమి కేటాయించడంతో పాటు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ సభలో సీఎం చేసిన ప్రకటనలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :