Tuesday, 03 December 2024 05:52:31 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Konda Surekha: మంత్రి కొండా సురేఖపై కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా

Date : 03 October 2024 05:30 PM Views : 29

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున క్రిమినల్, పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఆయన ఈ దావా వేశారు. నటి సమంత, నాగచైతన్య విడుకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మంత్రి కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పోరేటర్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పోరేటర్లు మాట్లాడుతూ... నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని, అందుకే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :