Studio18 News - TELANGANA / : హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభకు కాంగ్రెస్ నేత, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సభ హన్మకొండ పట్టణంలో మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది. గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో రెండుసార్లు వరంగల్ వచ్చారు. అప్పుడు కూడా ఆయన గైర్హాజరయ్యారు. సీఎం ఓరుగల్లు పర్యటనకు వచ్చినప్పుడు మాధవరెడ్డి గైర్హాజరు కావడం మూడోసారి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల వరంగల్ వచ్చినప్పుడు కూడా హాజరుకాలేదు. నేటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలాడుతున్నాడు: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
Admin
Studio18 News