Saturday, 14 December 2024 03:45:12 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన.. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే..

Date : 06 September 2024 11:14 AM Views : 45

Studio18 News - తెలంగాణ / : Shivraj Singh Chouhan : తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో పలు జిల్లాల్లో పంట నష్టం వాటిళ్లింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నష్టం ఎక్కువగా వాటిల్లింది. మున్నేరు ఉధృతికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మంలో కేంద్ర మంత్రులు పర్యటన కొనసాగనుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇవాళ విజయవాడలో వరద పరిస్థితులపై వివరించేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ తో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెంనాయుడు, బీజేపీ ఏపీ ప్రెసిడెంట్, ఎంపీ పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. ఇవాళ ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు భట్టి, బండిసంజయ్ వెళ్లారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి విజయవాడ నుంచి ఖమ్మంకు చేరుకుంటారు. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వీరితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా పాల్గోనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన ఇలా.. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన కొనసాగనుంది. కట్టలూరు, మీనవోలు, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్ ఏరియల్ సర్వే. ఏరియల్ సర్వే అనంతరం కూసుమంచి మండలం జుజ్జురావుపేట గ్రామంలో దెబ్బతిన్న కాలువ, పంట నష్టపోయిన పొలాలను పరిశీలిన. పాలేరు ట్యాంక్ బండ్ పై ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్న శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న కేంద్ర మంత్రులు. శివరాజ్ సింగ్ తో కలిసి రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్న బండి సంజయ్. వరద నష్టంపై సీఎం రేవంత్ తో కలిసి సమీక్షించనున్న కేంద్ర మంత్రులు. సమావేశం అనంతరం భోపాల్ వెళ్లనున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కోదాడ పర్యటనను రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :