Sunday, 08 March 2026 09:40:21 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Death Penalty: ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష

Date : 13 September 2024 01:52 PM Views : 349

Studio18 News - TELANGANA / : ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి సంగారెడ్డిలోని పోక్సో కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే బీహార్‌కు చెందిన గఫార్ అలీఖాన్ (56) బీడీఎల్‌లో కూలిపనులు చేస్తుండేవాడు. గతేడాది ఆక్టోబర్ 16న సంగారెడ్డి జిల్లా బానూరు బీడీఎల్‌కు చెందిన ఆరేళ్ల బాలికకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించాడు. ఆపై పత్తి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, ఈ విషయాన్ని బాలిక ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిన నిందితుడు ఆమెను హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గఫార్ అలీఖాన్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా జరిగిన కేసు విచారణలో నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయాధికారి జయంతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కేవలం 11 నెలల్లోనే ఈ కేసులో శిక్ష పడడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :