Studio18 News - తెలంగాణ / : తెలంగాణ పోలీస్ శాఖలో సీనియర్ అధికారులు పదోన్నతులు పొందారు. ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా లభించింది. అదనపు డీజీలుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, షికా గోయల్, అభిలాష బిస్తి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిలకు ప్రభుత్వం డీజీపీలుగా పదోన్నతి కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవేళ (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు సీఐడీ చీఫ్ షికా గోయల్, జైళ్ల శాఖ చీఫ్ సౌమ్య మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్తి అవే స్థానాల్లో కొనసాగుతారని ఆదేశాల్లో సీఎస్ పేర్కొన్నారు.
Admin
Studio18 News