Saturday, 14 December 2024 02:22:34 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మోసం చేశారు, తీవ్రంగా నిరాశపరించారు- బడ్జెట్‌పై హరీశ్ రావు

Date : 25 July 2024 05:27 PM Views : 65

Studio18 News - తెలంగాణ / : Harish Rao : రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్నారు. బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందని అభివర్ణించారు. ఆరు గ్యారంటీలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదన్నారు. ప్రజలను బురిడీ కొట్టించారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ”గత ప్రభుత్వం కంటే అధికంగా అప్పులు తెచ్చుకుంటామని ప్రతిపాదించారు. పెన్షన్ దారులను మోసం చేశారు. కోటిమంది అక్క చెల్లెమ్మళ్ళను నిరాశ పరిచారు. చేనేత కార్మికులకు మోసం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని చెప్పడం జోక్. బడ్జెట్ లో ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఉద్యోగుల జీతాలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. కేంద్రం నుంచి ఆశిస్తున్న నిధులు రావు. మా ప్రభుత్వ హయంలో వైద్య శాఖలో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాము. మంత్రి భట్టి.. మాటకు కట్టుబడి ఉంటారా? ఉద్యోగాలు భర్తీ చేయకపోతే నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. మీరు సిద్ధమా?” అని సవాల్ విసిరారు హరీశ్ రావు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :