Studio18 News - తెలంగాణ / : తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. నిన్న ఉదయం కలెక్టరేట్ సముదాయంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. దీంతో ఆయన కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారని అందరూ భావించారు. అయితే, ఆయన వచ్చింది తన నాలుగేళ్ల కుమార్తె స్వర్ణను అందులో చేర్చేందుకు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారని, ఆటపాటలు కూడా నేర్పుతున్నారని, అందుకే తన కుమార్తెను అందులో చేర్చినట్టు కలెక్టర్ తెలిపారు.
Admin
Studio18 News