Studio18 News - తెలంగాణ / : Mahabubabad : తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రద్దుచేయగా.. మరికొన్నింటిని దారిమళ్లించింది. రైల్వే ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతంలో రైల్వే శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. కేవలం 36గంటల్లోనే ట్రాక్ మరమ్మతు పనులను పూర్తి చేశారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తికాడంతో సింగిల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ఆ ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహించారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే.. ఇవాళ్టి నుంచి ఆ ట్రాక్ గుండా రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. అయితే, మరమ్మతులు పూర్తిచేసిన చోట రైళ్ల వేగం తగ్గించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ట్రాక్ బేస్మెంట్ పనులను 36 గంటల్లో రికార్డు స్థాయిలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. రాత్రి పగలు శ్రమించి ట్రాక్ పునరుద్దరణ పనులను రైల్వే సిబ్బంది పూర్తి చేశారు.
Admin
Studio18 News