Studio18 News - తెలంగాణ / : Youtuber Harsha : సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు యూట్యూబర్లు పైత్యం చూపిస్తున్నారు. పిచ్చిపిచ్చి చేష్టలతో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. గురువారం హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో హర్ష అనే యూట్యూబర్ రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో గాల్లోకి డబ్బులు విసిరాడు. కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ బైక్ పై స్టంట్స్ చేశాడు. ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వ్యూయర్స్ కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు తీస్తున్న హర్షపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో యూట్యూబర్ హర్షపై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేశారు. డబ్బులు విసిరే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన యూట్యూబర్ హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై డబ్బులు విసిరేస్తూ వీడియోలు రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో హర్ష అప్లోడ్ చేస్తున్నాడు. తాను టెలిగ్రామ్ లో గంటకి వేల రూపాయలు సంపాదిస్తున్నానంటూ, మీరుకూడా జాయిన్ అవ్వండి అంటూ హర్ష వీడియోలు పోస్టు చేస్తున్నాడు. హర్షపై సనత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
Admin
Studio18 News