Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనేందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని బీఆర్‌ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇవాళ శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో పెడతారని సంజయ్ ఎలా మాట్లాడతారని నిలదీశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమా అని రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఇద్దరు అసమర్థ కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కొత్త కల్వర్టుకైనా నిధులు తెచ్చారా అని నిలదీశారు. చిల్లర మాటలు మాట్లాడి సంజయ్ తన పరువు తీసుకుంటున్నారని రావుల శ్రీధర్ రెడ్డి చెప్పారు. కేటీఆర్‌ను అరెస్టు చేయకపోతే రేవంత్ రెడ్డిపై యుద్ధం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉన్నారా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా అని అడిగారు. సీఎం రేవంతె రెడ్డిపై విమర్శలు చేస్తే బండి సంజయ్ రేవంత్‌ను వెనకేసుకొస్తారని రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరో కేంద్రమంత్రి బీఆర్ఎస్ చేతిలో ఓడిపోతానని అంబర్ పేట నుంచి పారిపోలేదా అని నిలదీశారు. అసెంబ్లీలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను సమర్థిస్తున్నారని తెలిపారు.
Admin
Studio18 News