Sunday, 08 February 2026 11:32:08 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Date : 21 July 2024 10:36 AM Views : 438

Studio18 News - TELANGANA / : CM Revanth Reddy : సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. కాగా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఇదిలాఉంటే తెల్లవారు జామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు అలయ అర్చకులు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి బోనాల పండగ సంప్రదాయం ఉందని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :