Studio18 News - తెలంగాణ / : సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి సచివాలయానికి వస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు. ఆయన నోటి నుంచి వస్తున్న ఆణిముత్యాల లాంటి మాటలకు నవ్వుతున్న కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుంది. ఆయన బూతు పురాణానికి అమాయకంగా చప్పట్లు కొడుతున్న చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల కొమ్ముకాసిన నేటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆ తల్లి ఒప్పుకుంటదా? కేసీఆర్ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ తల్లి మౌనంగా రోదిస్తుంది. అమర వీరుల ఆత్మలు క్షోభిస్తున్నవి. మిమ్మల్ని ఈ జాతి క్షమించదు" అని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Admin
Studio18 News