Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీతక్క ఆయనకు రాఖీ కట్టి... మిఠాయి తినిపించారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, రాగమయి, కార్పోరేషన్ చైర్మన్లు శోభారాణి, శారద, సుజాత కూడా సీఎంకు రాఖీ కట్టారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు కూడా సీతక్క, ఎమ్మెల్యే రాగమయి రాఖీ కట్టారు. కోకాపేటలో మంత్రి హరీశ్ రావుకు పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఆయన అక్కా చెల్లెళ్లు, బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. కరీంనగర్ చైతన్యపురిలోని కేంద్రమంత్రి నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి.
Admin
Studio18 News