Studio18 News - తెలంగాణ / : తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్ లను సృష్టించారని అధికారులు గుర్తించారు. సోమేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అధికారులకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే వీరి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్ ఉండగా... సోమేశ్ కుమార్ ను ఏ5గా సీఐడీ పోలీసులు చేర్చారు.
Admin
Studio18 News