Studio18 News - తెలంగాణ / : Car Accident in SameerPate : హైదరాబాద్ శామీర్ పేట్ లో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఎదురుగా ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇన్నోవా కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. మజీద్ పురా చౌరస్తాలో ఇన్నోవా కారు అతివేగంగా దూసుకొచ్చి పల్టీకొట్టింది. పక్కనే రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఇన్నోవా కారులోని ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై నుంచి బస్సు, ఇన్నోవాకారును పక్కకు తొలగించారు. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు బస్సును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నోవా కారు ఎక్కడి నుంచి వస్తుంది.. కారులో ఎంత మంది ఉన్నారు.. ఎటునుంచి వస్తున్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Admin
Studio18 News