Saturday, 07 March 2026 09:05:52 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విబేధాలు.. ఎమ్మెల్సీ సారయ్యపై కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు ..

Date : 23 August 2024 02:18 PM Views : 394

Studio18 News - TELANGANA / : Former MLC Konda Murali : వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నట్లుగా రాజకీయ సాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ సారయ్యపై కొండా మురళి ఫైర్ అయ్యారు. వేరే పార్టీ నుంచి వచ్చిన సారయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేను ఏకగ్రీవ ఎమ్మెల్సీని అయినా రాజీనామా చేశా.. దమ్ముంటే నువ్వు రాజీనామా చెయ్ అంటూ సవాల్ చేశారు. వరంగల్ లో నడిచేది కొండా ప్రభుత్వం.. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం అంటూ హెచ్చరించారు. బీసీ నాయకుడివై ఉండి బీసీలకు అన్యాయం చేస్తావా అంటూ సారయ్య పై మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. సారయ్య వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. పేదల ఆస్తులు కూలిస్తే సారయ్యకు గుర్తింపు రాదు. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాం. ఎవరిని బెదిరించి రాజకీయాలు చేయడం లేదు. మమ్మల్ని చూసి నేర్చుకో.. నీ సొంత తమ్ముడే నిన్ను విభేదిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే ఎవరైనా రాజీనామా చేసి రావాలని సారయ్యను ఉద్దేశించి కొండా మురళి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కొండా సురేశ్ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయం సాధించారు. మంత్రి వర్గంలో ఆమెకు స్థానం దక్కింది. మరోవైపు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఆయన శిష్యుడిగా పేరొందిన ఎమ్మెల్సీ సారయ్య రెండు నెలల కిందట సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. సారయ్య కాంగ్రెస్ లోకి రావడాన్ని కొండా దంపతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పెద్దలు వారికి సర్దిచెప్పడంతో వెనక్కు తగ్గారు. అదే సమయంలో తూర్పు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు సారయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో సారయ్య వర్సెస్ కొండా వర్గాల మధ్య వివాదం మొదలైందని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట గోపాలస్వామి గుడి రోడ్డులో చిరు వ్యాపారుల డబ్బాలను గ్రేటర్ వరంగల్ సిబ్బంది తొలగించారు. దీని వెనుక సారయ్య ఉన్నాడని ప్రచారం జరగడంతో కొండా మురళి సారయ్యపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :