Monday, 09 September 2024 03:15:07 AM
# HYDRAA: వేటిని కూల్చివేస్తున్నామంటే... స్పష్టత ఇచ్చిన 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ # Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు # Kishan Reddy: రాజకీయాలకు అతీతంగా వీరిని ఆదుకుందాం: కిషన్ రెడ్డి # Apple Glowtime Launch Event : ఆపిల్ గ్లోటైమ్ లాంచ్ ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ నుంచి మొత్తం 4 మోడల్స్.. ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే? # Heavy Rains: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు # Vangalapudi Anitha: జగన్ సొంత డబ్బుతో ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు: హోంమంత్రి అనిత # Flood Damage: తెలంగాణలో వరద నష్టం ఎంతంటే...! # Vijay: తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు # రోడ్లపైకి వచ్చి కొట్లాడాలి.. విద్యార్థుల సమస్యలపై గళం విప్పాలి: బండి సంజయ్ # ACA President : ఏసీఏ అధ్య‌క్షుడిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏకగ్రీవ ఎన్నిక.. తొలి నిర్ణయంగా అదే.. # వరద సహాయంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం # రుణ‌మాఫీ ల‌బ్దిదారుల‌ను ఆంక్ష‌ల పేరుతో వేధిస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్ # Deepika Padukone : పండంటి పాపాయికి జన్మనిచ్చిన దీపికా పదుకోన్.. # రష్యా – ఉక్రెయిన్ వార్‌కు చెక్ పెట్టేలా మోదీ అడుగులు.. రంగంలోకి అజిత్ డోభాల్ # Prabhas New Look : ప్రభాస్ కొత్త లుక్ చూశారా? సన్నబడ్డ రెబల్ స్టార్..? # Boats: ఆ మూడు బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ కు చెందినవి: టీడీపీ # Nara Lokesh: ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ ప్రభుత్వంపై విమర్శలా? మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ మంత్రి లోకేశ్ # Raja Singh: హైడ్రా కూల్చివేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # HYDRA: సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆక్రోశం.. వైరల్ వీడియో # HYDRA: హైడ్రా రానక్కర్లేదు.. ఆ షెడ్‌ను మేమే తొలగిస్తాం: మురళీ మోహన్

Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మార్గదర్శకాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

Date : 09 August 2024 12:11 PM Views : 28

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్‌కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్‌ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :